constitutional amendments in telugu 51 to 80 - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Saturday 4 December 2021

constitutional amendments in telugu 51 to 80

  

constitutional amendments in Telugu 51-80

 రాజ్యాంగ సవరణలు  ముఖ్యాంశాలు

రాజ్యాంగ సవరణ 51 to 80


constitutional amendments constitutional amendments in india constitutional amendment bill constitutional amendments list constitutional amendment 25 constitutional amendments pdf constitutional amendment 26 constitutional amendment 104 constitutional amendments list pdf constitutional amendments are constitutional amendment 1992 constitutional amendment 1976 constitutional amendments 2020 constitutional amendments in india pdf 33 constitutional amendments constitutional amendments 2021 constitutional amendments in india upsc constitutional amendment 102 constitutional amendments 4 constitutional amendments 3 florida constitutional amendments 5 what are the 3 amendments constitutional amendments 6 constitutional amendment no 3 constitutional amendment 2016 constitutional amendments 3 constitutional amendments 2 3 constitutional amendments pennsylvania 4 constitutional amendments dealing with the right to vote florida constitutional amendments 5


51 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1986 జూన్ 16న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరామ్, నాగాలాండ్ లోని పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.

 

52 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1985 మార్చి 1న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టారు.

 

53 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1987 ఫిబ్రవరి 20న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతం అయిన మిజోరాంనీ 23వ రాష్ట్రంగా చేయడం జరిగింది.

 

54 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1986 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మరియు ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలను పెంచారు. 

 

55 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1987 ఫిబ్రవరి 20న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 24వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ ఏర్పాటు చేశారు

 

56 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1987 మే 30న అమలులోకి వచ్చింది దీని ప్రకారం 25వ రాష్ట్రంగా గోవా ను ఏర్పాటు చేశారు.డామన్, డయ్యును కేంద్ర పాలిత ప్రాంతంగా విడగొట్టారు. 

 

57 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1987 సెప్టెంబర్ 21న అమలులోకి వచ్చింది ఈ సవరణ ప్రకారం నాగాలాండ్,మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో లోక్ సభ మరియు శాసనసభలో షెడ్యూల్ తెగలకు ప్రత్యేక ఏర్పాట్లు.

 

58 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1987 డిసెంబర్ 9న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం హిందీ భాష లోకి రాజ్యాంగాన్ని అధికారికంగా తర్జుమా చేశారు.

 

59 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1988 మార్చి 30న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం రాష్ట్రపతి పాలన పంజాబ్లో మూడు సంవత్సరాలకు పెంచారు.

 

60 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1988 డిసెంబర్ 20న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు విధించే పన్నురూ. 250 నుండి రూ.2,500 వరకు పెంచారు. 

 

61 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1989 మార్చి 21న అమలులోకి వచ్చింది ఈ సవరణలో 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది.

 

 62 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1989 డిసెంబర్ 20న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీలు మరియు ఆంగ్లో ఇండియన్ లకు పార్లమెంట్ మరియు శాసన సభలో మరో 10 సంవత్సరాల్లో రిజర్వేషన్లు పొడిగించడం జరిగింది.

 

63 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1990 జనవరి 6న అమలులోకి వచ్చింది ఈ సవరణలో 59 వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన అంశాలను తొలగించారు.

 

64 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1990 ఏప్రిల్ 16న అమలులోకి వచ్చింది. రాష్ట్రపతి పాలనను పంజాబ్లో మరో ఆరు నెలలు పొడిగించారు.

 

65 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1990 మార్చి 12న అమలులోకి వచ్చింది. దీని ద్వారా జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించారు.

 

 66 వ రాజ్యాంగ సవరణ

ఇది 1990 జూన్ 7న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం 9వ షెడ్యూల్లో భూసంస్కరణలకు సంబంధించిన రాష్ట్రాలు చేసిన 55 చట్టాలను చేర్చారు.

 

67 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1990 అక్టోబర్ 4న అమలులోకి వచ్చింది. ఈ సవరణలో రాష్ట్రపతి పాలనను పంజాబ్లో నాలుగు సంవత్సరాలు పొడిగించారు.

 

68 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1991 మార్చి 12న లోకి వచ్చింది. ఈ సవరణ లో పంజాబ్ లో రాష్ట్రపతి పాలన మరో ఐదు సంవత్సరాలు పొడిగించారు.

 

 69 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1992 అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టేరిటరి ఢిల్లీ గా పరిగణిస్తారు.  

 

70 వ రాజ్యాంగ సవరణ

ఇది 1991 డిసెంబర్ 21 న అమలులోకి వచ్చింది ఈ సవరణ ప్రకారం ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది.

 

71 వ రాజ్యాంగ సవరణ

 ఈ సవరణ 1992 ఆగస్టు 31న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం 8వ షెడ్యూల్లో నేపాలి, మణిపురి, కంకొని భాషలను చేర్చారు. దీని ద్వారా భాషల సంఖ్య 15 నుండి 18 వరకు పెరిగింది. 

 

72 వ రాజ్యాంగ సవరణ

సవరణ 1992 డిసెంబర్ 5న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం త్రిపుర శాసనసభలో షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్లు వర్తింపజేశారు.

 

 73వ రాజ్యాంగ సవరణ

ఇది 1993 ఏప్రిల్ 24న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది.

 

74వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1993 జూన్ 1న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం మున్సిపాలిటీలకు, నగరపాలిక వ్యవస్థకి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది.

 

 75 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1994 మే 15న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం గృహ హక్కుదారులు. అడ్డుకున్న వారికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది.

 

 76 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1994 ఆగస్టు 31న లోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం తమిళనాడు ప్రభుత్వం కొన్ని తరగతులకు 69 శాతం రిజర్వేషన్లను కల్పించి ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చారు.

 

 77 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 1995 జూన్ 17న అమలులోకి వచ్చింది. ఈ సవరణలో ఎస్సీ,ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు.

 

78 వ రాజ్యాంగ సవరణ

ఇది  1995 ఆగస్టు 30న అమలులోకి వచ్చింది. ఈ సవరణలో వివిధ రాష్ట్రాలు చేసిన భూసంస్కరణలకు సంబంధించిన చట్టాలను చేర్చారు.

 

 79 వ రాజ్యాంగ సవరణ

ఇది 2000 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలు మరియు ఆంగ్లో ఇండియన్ లకు పార్లమెంటు, శాసనసభ లో పది సంవత్సరాలు రిజర్వేషన్లు పొడిగించారు.

 

 80 వ రాజ్యాంగ సవరణ

ఈ సవరణ 2000 జూన్ 9న అమలులోకి వచ్చింది. పదవ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర రాష్ట్రాల మధ్య పన్ను రాబడిలో 29 శాతాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడం.


 ALSO READ:- constitutional amendments in Telugu 01 to 25

ALSO READ:- constitutional amendments in Telugu 26 to 50

 ALSO READ:- constitutional amendments in Telugu 51 to 80

ALSO READ:- constitutional amendments in Telugu 81 to 105

No comments:

Post a Comment